- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రిని పోగొట్టుకున్న అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన లోకేశ్
దిశ, వెబ్ డెస్క్: తండ్రిని పోగొట్టుకున్న అక్కా చెల్లెళ్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అండగా నిలిచారు. నంద్యాల జిల్లాకు చెందిన పురందేశ్వరి, స్నేహలత అక్కా చెల్లెళ్లు. కరోనా సమయంలో తండ్రి ఆ వైరస్ సోకింది. దీంతో వాళ్ల ఆస్తినంతా అమ్మి వైద్యం చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. తండ్రి మరణించారు. అయితే అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పురంధేశ్వరి బీటెక్ చదువుతున్నారు. స్నేహలత కూడా చదువుకుంటున్నట్లు తెలిసింది. తండ్రి లేకపోవడంతో వీరి చదువులు అగమ్య గోచరం అయ్యాయి. దీంతో నారా లోకేశ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
నంద్యాలలో నారా లోకేశ్ యువగళం సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన పురంధేశ్వరి తన కుటుంబం పడుతున్న అవస్థలపై లోకేశ్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చలించిపోయిన లోకేశ్ వెంటనే కీలక హామీ ఇచ్చారు. తండ్రి లేరని బాధ పడవద్దని.. అన్నగా తాను అండగా ఉంటానని చెప్పారు. పురంధేశ్వరి, స్నేహలత చదువుల బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎంత వరకూ అంత చదువుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నారా లోకేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నంద్యాల యువగళం సభలో పురందేశ్వరి అనే బీటెక్ విద్యార్థిని కన్నీటి ఆవేదన నన్ను కదిలించింది. కరోనాతో తండ్రి చనిపోగా, ఉన్న ఆస్తి వైద్యానికి అమ్మేశారు. దీంతో అక్కాచెల్లెళ్లు పురందేశ్వరి, స్నేహలతల చదువులు అగమ్యగోచరం అయ్యాయి. ఆ చెల్లెళ్లను చదివించే బాధ్యత అన్నగా నేను… pic.twitter.com/OyMt0zlB7W
— Lokesh Nara (@naralokesh) May 8, 2024