- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allagadda: ఫోన్ మాట్లాడుతూ వివాహిత దుర్మరణం

X
దిశ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని ఓ హోటల్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఆమెను లారీ ఢీకొట్టింది. అనంతరం తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు బద్వేల్ ఐలమ్మ కాలనీకి చెందిన వివాహితగా గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివాహితను గుర్తుతెలియని వ్యక్తి లారీ కిందికి నెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story