- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srisalamలో సామాన్య భక్తులకు కష్టాలు
దిశ, శ్రీశైలం: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానం వినూత్న రీతిలో ఆన్‌లైన్ ఆర్జీత సేవా టికెట్లు త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే అధికం, సాధారణ, నిరక్షరాస్యులైన భక్తులకు దేవస్థానం నిర్ణయం పెద్ద షాక్‌కు గురి చేసింది. దేవస్థానం అధికారులు కేవలం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే స్వామి వారి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలుంటాయని వెల్లడించింది. అంతేకాదు మే ఒకటో తారీఖు నుంచి ఆన్ లైన్ దర్శనం, ఆర్థిక సేవ టికెట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. అయితే ఈ ఆర్జిత టికెట్లు వీఐపీలకు, మీ సేవ సెంటర్లకు సొంతమవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువురాని తమకు మల్లన్న దర్శనం దూరమవుతుందని నిరక్ష రాసులైన భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.