పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ఎస్ఎఫ్ఐ

by Javid Pasha |
పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. ఎస్ఎఫ్ఐ
X

దిశ, కర్నూలు : కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు అమర్ బాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృష్ణా యూనివర్శిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇటీవల విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

వీరి ఆందోళనకు నాయకత్వం వహించిన పవన్ కుమార్ వీసీ ఛాంబర్ పక్క రూమ్ లో కూర్చుని ఉండగా ఎస్ఐ వాసు తన సిబ్బందితో కలిసి పవన్ ఒంటిపై బట్టలు ఊడదీసి మరీ పై ఫ్లోర్ నుంచి కింద వరకు లాక్కు రావడం, ఆ తర్వాత యూనివర్శిటీ మెయిన్ డోర్ క్లోజ్ చేసి పవన్ కడుపులో గుద్దడం వంటివి చేసి అవమానపరిచారన్నారు. విద్యార్థి సమస్యల పట్ల పోరాడుతున్న విద్యార్థి నాయకులను ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పవన్ పై దాడి చేసిన ఎస్ఐ, పోలీసులను సస్పెండ్ చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, వలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story