Naralokesh: యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం

by srinivas |   ( Updated:2023-05-21 04:20:46.0  )
Naralokesh: యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం
X

దిశ, బనగానపల్లె: యువగళం పాదయాత్రకు అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతోన్న యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మనది సైకిల్ ప్రభుత్వం.. జగన్ ది సైకో ప్రభుత్వమని విమర్శించారు. టీడీపీ హయాంలో నీళ్లు..జగన్ హయాంలో కన్నీళ్లు వచ్చాయని మండిపడ్డారు. యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తామని, జగన్ నిస్సిగ్గుగా పేదవాడినని పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శించారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా?, లక్ష విలువ చేసే చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? అని విమర్శించారు. తమ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, సాగానిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర అని నారా లోకేష్ హెచ్చరించారు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన పవిత్ర నేల బనగానపల్లె అని చెప్పారు. యువగళం..మనగళం..ప్రజాబలం అని లోకేష్ తెలిపారు.

Read more:

పొగడ్తలతో పొట్ట నిండేనా.. లీడర్లను చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు

Advertisement

Next Story