Nara Lokesh: మంత్రి జయరాం.. రూ.45 కోట్ల భూములు కొట్టేయలేదా..!

by srinivas |
Nara Lokesh: మంత్రి జయరాం.. రూ.45 కోట్ల భూములు కొట్టేయలేదా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌పై మరోసారి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రూ. 45 కోట్ల విలువైన 180 ఎకరాల భూములను కేవలం రూ.2కోట్లకు కారు చౌకగా కొట్టేశారని ధ్వజమెత్తారు. అవన్నీ ఇట్టినా కంపెనీ భూములేనని.. ఇందుకు సంబంధించిన ఆధారాలను లోకేశ్ బయటపెట్టారు. కమర్షియల్ భూమిని వ్యవసాయ భూములుగా చూపించి, కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను నారా లోకేశ్ చూపించారు. వ్యవసాయంలో లాభం వచ్చిందని చెప్పిన మంత్రి జయరాం...పంట నష్టపరిహారం డబ్బులు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. రైతులు ముందుకు వస్తే ఇట్టినా భూములను రాసిస్తానని జయరాం చెప్పారని... రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పాలని లోకేశ్ సవాల్ విసిరారు. ఐటీ బినామీ చట్టం ప్రకారం బెంజ్ మంత్రి జయరాం అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఇట్టినా భూములను ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీశారు. మంత్రి అయ్యాక గుమ్మనూరు జయరాం వందల ఎకరాల భూమికి అధిపతి అయ్యారని, కానీ నియోజకవర్గంలో ఒక్క వాల్మీకి కుటుంబం కూడా ఎకరం భూమి అయినా కొనే స్థితిలో లేకుండా పోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story