Nandikotkur లో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే

by srinivas |   ( Updated:2022-11-28 14:43:16.0  )
Nandikotkur లో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే
X
  • సీఎం జగన్‌కు విధేయుడు.. ప్రజల సేవకుడు
  • గడపగడపలో దూసుకుపోతున్న ఆర్థర్
  • టీడీపీ నుంచి వైసీపీలో 50 కుటుంబాలు చేరిక

దిశ, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీలో ఎమ్మెల్యే‌తో గూర్ ఆర్థర్ రోజు రోజుకు మరింత పట్టు సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గ నుంచి గతంలో చాలా మంది మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ ,శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి రాష్ట్రాన్ని , కర్నూలు జిల్లాను సైతం శాసించారు. అయితే వైసీపీ శాసనసభ్యుడు, సీనియర్ విశ్రాంత ఉద్యోగి పోలీస్ అధికారి ఆర్థర్ కూడా ప్రస్తుతం బలమైన శక్తిగా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు వివరించడంలో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. 'అవ్వ బాగున్నావా? ...తాతయ్య పెన్షన్ వస్తుందా? ..తమ్ముడు ఎలా చదువుతున్నావు? ...అమ్మ ఒడి ఖాతాలో పడిందా?..జగనన్న లేఔట్‌లో ఇల్లు వచ్చిందా? అంటూ అందర్నీ ఆపాయంగా పలకరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి మరింత దగ్గరవుతున్నారు.

కాగా 2014 నుంచి వరుసగా రెండుసార్లు నందికొట్కూరు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఐఆర్ఎస్ అధికారి ఎక్కలదేవి ఐజయ్య వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి లబ్బీ వెంకటస్వామిపై విజయం సాధించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండి జయరాజుపై పోలీస్ అధికారి ఆర్థర్ ఘన విజయం సాధించారు. వాస్తవంగా 2014 ఎన్నికల్లోనే ఆయనకు నందికొట్కూరు నుంచి వైసీపీ టికెట్ వస్తుందని అంతా ఆశించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆ టికెట్టు ఐజయ్యకు దక్కింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరోసారి నందికొట్కూరు నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. ఆయనను వెనక్కు లాగేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ లెక్కచేయకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ప్రజల ఆదరణ పొందిన ఆర్థర్ ముందుకు సాగడం గమనార్హం.

ఇటీవల ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే ఓర్వకల్లు విమానాశ్రయంలో కలిసి పలు సమస్యలపై వివరించారు. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక మూడో తేదీ జరిగిన ధనుంజయరెడ్డి, ఐబ్యాక్ టీంతో కలిసి నియోజవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీ ఎమ్మెల్యేకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని తెలుస్తోంది. నందికొట్కూరు మండలంలోని కోళ్ల బావాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.

ఇవి కూడా చదవండి

Kodali Nani: రాజకీయాలు వదిలేస్తా

Advertisement

Next Story

Most Viewed