- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Shilpa Chakrapani: ఆ దమ్ముందా చంద్రబాబు, లోకేశ్..!
దిశ, శ్రీశైలం: శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సున్నిపెంట గ్రామం వెస్ట్రన్ కాలనీ, పెట్రోల్ సెంటర్, రిక్షా కాలనీ, వైజాగ్ క్యాంప్ నందు మహిళలతో కొద్దిసేపు ముచ్చడించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సదరు సమస్యలన్నీ పరిష్కరించే విధంగా అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం మీడియా మాట్లాడుతూ జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా ధైర్యం అంటూ ప్రతి మహిళ, కార్యకర్త చెప్పటం ఆనందదాయకమని ఆయన తెలియజేశారు.
ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యే శిల్ప ఓపెన్ చాలెంజ్
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రతిపక్ష పార్టీలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తమ కార్యకర్తలు జగనన్న ముద్రికలను ఇంటింటికి అతికిస్తున్నట్లుగా అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న మీరే నా నమ్మకం కార్యక్రమంతో ప్రజల వద్దకు ఎంపీలు, ఎమ్మల్యేలు స్వయంగా వెళ్లి సమస్యలను తీరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రోజువారి కూలీలతో నారా లోకేష్ యువగళం యాత్రని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. యువగళంలో పెయిడ్ ఆర్టిస్టులు తప్ప, కార్యకర్తలు కూడా ఆయన వెంట నడవడం లేదని విమర్శించారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే సత్తా ఆయనకు ఉందన్నారు. కావాలంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆయనకు ఎదురుగా నిలబడి పోటీ చేసి పరీక్షించుకోవచ్చని శిల్పా చక్రపాణి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.