చంద్రబాబుకు పవన్ ఓడిపోవాలనుంది: Mininister Jayaram

by srinivas |   ( Updated:2023-02-06 12:27:16.0  )
చంద్రబాబుకు పవన్ ఓడిపోవాలనుంది: Mininister Jayaram
X

దిశ, ఆలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఉందని మంత్రి అన్నారు. ఆలూరులో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ టీడీపీ హాయంలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నేర్చవేర్చలేదని... అందుకే ఆయనను ప్రజలు నమ్మడం లేదన్నారు. సీఎం జగన్ దాదాపు 98 శాతం హామీలు నెరవేర్చారన్నారు. ఈసారి చంద్రబాబు కుప్పంలో గెలవరని జోస్యం చెప్పారు. 175 సీట్లు గెలిచేందుకు ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కనీసం ఆయనకైనా తెలుసా? అని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని కాలర్ ఎగురవేసి చెప్పుకోవచ్చన్నారు. మూడేళ్లలో ఆలూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని మంత్రి జయరాం పేర్కొన్నారు.

Advertisement

Next Story