టీడీపీ గెలిస్తేనే యువ‌త‌కు భ‌విష్య‌త్తు: టీజీ భరత్

by srinivas |
టీడీపీ గెలిస్తేనే యువ‌త‌కు భ‌విష్య‌త్తు: టీజీ భరత్
X

దిశ, న్యూస్ కర్నూలు: వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తేనే యువ‌త‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ఆ పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడారు. టీడీపీ, జ‌న‌సేన ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. తమ అధినేత చంద్ర‌బాబు చేప‌ట్టిన ‘రా క‌ద‌లిరా’ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వస్తోందని తెలిపారు. పెరిగిపోయిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు, క‌రెంటు చార్జీలు, పన్నుల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితులు చూస్తున్నామ‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తే ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌నే భ‌రోసా ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నామ‌ని చెప్పారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి రాష్ట్రంలో యువ‌త‌కు భారీగా ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేయ‌కుండా సొంత రాష్ట్రంలోనే ప‌ని చేసుకునే ప‌రిస్థితులు ఉంటాయ‌న్నారు. యువ‌త భ‌విష్య‌త్తుకు టీడీపీ గ్యారెంటీ ఇస్తుంద‌న్నారు. ఇక క‌ర్నూల్లో ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తీరాలంటే వచ్చే ఎన్నికల్లో త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లో వచ్చానని టి.జి భ‌ర‌త్ తెలిపారు.

Advertisement

Next Story