Interesting Scene: ఇప్పుడే రాజకీయాలొద్దు... మంచిగా చదువుకో!

by srinivas |   ( Updated:2023-04-19 16:30:35.0  )
Interesting Scene: ఇప్పుడే రాజకీయాలొద్దు... మంచిగా చదువుకో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యువగళం పాదయాత్ర కొనసాగుతుండగా ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు. ఇది గమనించిన యువనేత లోకేశ్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. అప్పుడే రాజకీయాలు వద్దు, ముందు మంచిగా చదువుకోవాలని సూచించారు. అనంతరం బాలుడు వేసుకున్న టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈరోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం దూరదృష్టితో లోకేశ్ ఆలోచించడం అభినందనీయమని టీడీపీ నేతలు అంటున్నారు.

Read more:

MP Raghurama: వివేకా హత్య, కోడి కత్తి సానుభూతితోనే వైసీపీ గెలిచింది

Advertisement

Next Story