- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
దిశ, కోడుమూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసుర్యప్రకాష్ రెడ్డి అన్నారు. కోడుమూరు పంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఇది ఎక్కువ రోజులు పని చేయదని హెచ్చరించారు.
వైసీపీ అరాచకాలను సహించమని గ్రామాల నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయని కోట్ల తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించి కర్నూలు ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఒక్కసాగునిటి ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని, కేవలం దోచుకోవడానికి, దాచుకోవడానికి పని చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని కోట్ల ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.