మార్షల్ ఆర్ట్స్‌కు ఆదరణ పెరగాలి: Hero Suman

by srinivas |   ( Updated:2023-05-21 12:49:06.0  )
మార్షల్ ఆర్ట్స్‌కు ఆదరణ పెరగాలి: Hero Suman
X

దిశ, కర్నూలు ప్రతినిధి: రాష్ట్రంలో మార్షల్స్ ఆర్ట్స్‌కు ఆదరణ తప్పక పెరగాలని సినీ హీరో సుమన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం కర్నూలు మౌర్యా ఇన్ హోటలో బస చేసిన సుమన్‌ను కర్నూలు జిల్లా తైక్వాండో ప్రధాన కార్యద‌ర్శి, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షుడు జి.శోభన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధి గురించి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. మార్షల్ ఆర్ట్స్‌లో 4th డాన్ బ్లాక్ బెల్ట్ ఆయన సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం నాణ్యత లేని క్రీడలు ప్రయోజనకరంగా మరాయన్నారు. డబ్బే ప్రాధాన్యతగా మార్షల్ ఆర్ట్స్ నడుస్తున్నాయన్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆయిన కరాటే, తెక్వాండో లాంటి క్రీడల్లో వీధి వీధికి విస్తరించేలా చేయాలన్నారు. ప్రస్తుతం ఈ ఆటలు నేర్పేది ఏవ్వరో తెలియని పరిస్థితి ఉందన్నారు. తప్పక క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే సరైన శిక్షకులు లేరని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంత‌రం శోభ‌న్‌బాబు మాట్లాడుతూ సుమన్, శోభన్ బాబు కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేశారని, ఆ సమయంలో తైక్వాండో‌కు ఎంతో ఆదరణ లభించిందన్నారు. సుమన్ ప్రోత్సహంతో రాష్ట్రంలో అనేకమైన తెక్వాండో శాఖలను ప్రోత్సహించటం ప్రారంభమైందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed