Srisailam: 9 రోజుల్లో భక్తులు ఎంత సమర్పించారంటే..

by srinivas |
Srisailam: 9 రోజుల్లో భక్తులు ఎంత సమర్పించారంటే..
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల హుండీ ఆదాయం 2 కోట్ల 70 లక్షల 51 వేల 419 రూపాయలు వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు నిర్వహించామని ఆయన తెలిపారు. గడిచిన 9 రోజుల్లో భక్తులు స్వామి అమ్మవార్ల హుండీల్లో కానుకలు సమర్పించారని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారని ఈఓ లవన్న చెప్పారు.

Advertisement

Next Story