Nallamala: భక్తులపై తినేటీగల దాడి.. ఒకరి మృతి, 60 మందికి గాయాలు

by srinivas |   ( Updated:2023-05-16 09:21:13.0  )
Nallamala: భక్తులపై తినేటీగల దాడి.. ఒకరి మృతి, 60 మందికి గాయాలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: నల్లమల అటవీ ప్రాంతంలో భక్తులపై తేనే టీగలు దాడి చేశాయి. ఈ ఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగుల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 60 మంది అస్వస్థతకు గురయ్యారు.


నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన ఓ కుటుంబం దాదాపు 180 మంది బంధువులతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు మాడుగుల నల్లమల అటవీ సమీపంలోని ధనుశ్యాల లింగమయ్య వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెట్లపై ఉన్న తేనే టీగలు భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన విశ్రాంత వీఆర్ఓ వెంకట శివారెడ్డి (65) మృతి చెందగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, బంధువులు క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఎర్రమఠం గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Advertisement

Next Story