- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > Srisailam: భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. 27 రోజుల్లో ఎంత వచ్చిందంటే...!
Srisailam: భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. 27 రోజుల్లో ఎంత వచ్చిందంటే...!
by srinivas |
X
దిశ, శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉభయ దేవాలయాల హుండీ ఆదాయం రూ.4 కోట్ల 3 లక్షల 29 వేల 226 వచ్చిందని ఆలయ ఈఓ లవన్న వెల్లడించారు. శ్రీశైలం అక్కమహాదేవి అలంకరణ మండపంలో పటిష్టమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గడిచిన 27 రోజుల్లో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని హుండీ కానుకలు సమర్పించారని పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన నగదును లెక్కించగా రూ.4.3 కోట్లు వచ్చినట్లు లవన్న స్పష్టం చేశారు. నగదుతో పాటు 521 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 130 గ్రాముల వెండి హుండీ లెక్కింలో వచ్చినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.
Advertisement
Next Story