- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atmakur: చిరుత మృత్యువాత.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
దిశ, ఆత్మకూరు: ఆత్మకూరు అటవీ డివిజన్ శ్రీశైలం రేంజ్ పరిధి పెచ్చెర్వు తూర్పు బీట్ దయ్యామడుగు ప్రదేశంలో చిరుత మృత్యువాత పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న ఫారెస్టు బీట్ ఆఫీసర్, ప్రొటెక్షన్ వాచర్లు గస్తీ నిర్వహిస్తుండగా దయ్యామడుగు ప్రదేశంలో చిరుత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌కు తెలిపారు. వెంటనే ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తర్వాత న్యూఢిల్లీకి చెందిన ఎన్టీసీఏ బృందానికి తెలియజేశారు. దీంతో బుధవారం కమిటీ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు. అయితే చిరుత మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, బుల్లెట్ గాయాలు కూడా లేవన్నారు. అలాగే చిరుత అవయవాలు కూడా ఎక్కడా మిస్ కాలేదన్నారు. అయితే చిరుత శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీ, ఎన్టీసీఏ సూచనల మేరకు ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలియజేశారు.