- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ నిధులు వెనక్కి... కారణం Cm Jagan అంటూ బీజేపీ ఎంపీ మండిపాటు
దిశ, కర్నూలు ప్రతినిధి: గత, ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం దాదాపుగా రూ.70 వేల కోట్ల నిధులు కేటాయించిందని.. కానీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిదానికీ స్పెషల్ స్టేటస్ ఇష్యూను తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్‌కు బదులుగా ఇన్ డైరెక్ట్‌గా కేంద్రం పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదని, దానివల్ల ఆ ఫండ్స్ వెనక్కి వెళుతున్నాయని టీజీ వెంకటేశ్ మండిపడ్డారు.
కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో లక్షల ఇళ్లు కట్టించిందని, ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకిస్తే మరికొన్ని మంజూరు చేస్తుందని టీజీ వెంకటేశ్ తెలిపారు. నీరు, రోడ్లు, రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని జీతాలకు వాడుకుంటోందని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. కొందరి నాయకుల వల్ల కర్నూలు శివారులోని రైల్వే రీహ్యాబిటేషన్‌కు ఆటంకం వాటిల్లుతుందన్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేకపోతున్నారన్నారని టీజీ వెంకటేశ్ తెలిపారు.