- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Amaravatiలోనే హైకోర్టు.. సీమకు అన్యాయం చేస్తున్నారు'
దిశ, డైనమిక్ బ్యూరో : రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో న్యాయ రాజధాని అనేది సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హైకోర్టు అమరావతిలోనే కావాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాటల అర్థం..పరమార్థం ఏమిటో రాయలసీమ ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడిమో విడుదల చేశారు.
''సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై జరిగిన వాదనల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్న ఆందోళన ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం చాలా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కర్నూలులో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే అదంతా ముగిసిపోయిన అధ్యాయం. కర్నూలులో పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పుడేమీలేదని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వివరించారు. అమరావతిలోనే హైకోర్టు ఉండాలని హైకోర్టు చెప్పిందని తెలిపారు. అయితే హైకోర్టు ఎక్కడ ఉండాలని ప్రభుత్వం భావిస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించగా అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు.'' అని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి