Kurnool: దేవనకొండలో బిర్యానీ హోటల్ దగ్ధం

by srinivas |   ( Updated:2023-06-15 15:30:58.0  )
Kurnool: దేవనకొండలో బిర్యానీ హోటల్ దగ్ధం
X

దిశ, దేవనకొండ: ఓ వైపు భానుడు భగభగలు.. మరోవైపు భయంకరమైన అగ్నిప్రమాదాలు. దీంతో ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో అగ్నిప్రమాదం జరిగింది. నరసింహుడు అనే వ్యక్తి బిర్యానీ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పత్తికొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే హోటల్ మొత్తం మంటల్లో దహనమైపోయింది. పక్క హోటల్‌కు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరగడంతో హోటల్ యజమాని లబోదిబోమన్నారు. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేయాలని బాధితుడు నరసింహుడు వేడుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed