- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramapuram: కుమార్తె పెళ్లి కోసం భారీగా దాచిన సొమ్మంతా దోచేశారు..
దిశ, బనగానపల్లె / అవుకు : నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి తన కుమార్తె వివాహం కోసం దాచి పెట్టిన 70 తులాల బంగారు, రూ.15 లక్షల నగదును అపహరించారు. రామాపురం గ్రామానికి చెందిన నాపరాళ్ల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు వెళ్లారు. వారు తిరుపతికి వెళ్లే సమయంలో ఆయన గుమస్తా అయిన వెంకటేశ్వర్లును ఇంటి వద్ద కాపలా ఉండాలని చెప్పారు. దీంతో గుమస్తా వెళ్లకుండా బెలుం శింగవరం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి చెప్పి తన యజమాని ఇంటి వద్ద రాత్రి కాపలా ఉండాలని చెప్పారు. వారిలో ఎవరు ఇంటి వద్ద కాపలా ఉన్నారో లేదో తెలియదు గానీ యజమాని వెంకటేశ్వర్లు ఆదివారం ఉదయం వచ్చే సరికి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లోకెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులో ఉంచిన 70 తులాల బంగారు బిస్కెట్లు, రూ.15 లక్షల నగదును అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ సుబ్బారాయుడు, ఎస్ఐ జగదీశ్వర రెడ్డి సిబ్బందితో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా గుమస్తాపై అనుమానం ఉండడంతో ఆయనను, ఆయన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో వెంకటేశ్వరరెడ్డిని బెదిరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.