- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rayalaseema వాసుల తీవ్ర డిమాండ్.. మంత్రి పెద్దిరెడ్డితో నెరవేరుతుందా..?
దిశ, అనంతపురం: కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాప్తాడులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ గోదావరి బోర్డు ఏర్పాటు స్థానంపై తెలంగాణ, కృష్ణానది బోర్డు ఏర్పాటు స్థానంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే హక్కును విభజన చట్టం కల్పించిందని గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల మధ్య శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకమై ఉందన్నారు. చాలా వివాదాలకు కారణమవుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ తదితర కీలక అంశాల పర్యవేక్షణకు బోర్డు కార్యాలయం కర్నూలు కేంద్రంగా ఉండటం సమంజసమని తెలిపారు. లేని పక్షంలో రాయలసీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య భవనం బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు మరి మంత్రి పెద్దిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.