నల్లమలలో కారు దగ్ధం

by srinivas |
నల్లమలలో కారు దగ్ధం
X

దిశ, శ్రీశైలం: నల్లముల ఫారెస్ట్ తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలో కారు దగ్ధమయింది. రోడ్డుపై కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు కారును వదిలి కిందకి దిగారు. స్థానికులు కారులో ఉన్న సామాన్లు బయటకు తీశారు. మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కారు పూర్తిగా తగులబడిపోయింది. విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని కారు ప్రయాణికులు అంటున్నారు.

Advertisement

Next Story