- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chalo Vijaywada: ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత.. అగ్రిగోల్డ్ బాధితుల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు, బాధిత సంఘం నాయకులు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు కోరాడ రాంబాబు, షరీఫ్ తదితులను ముందస్తు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఏపీ నలుమూలల నుంచి విజయవాడకు భారీగా చేరుకుంటున్నారు. అయితే విజయవాడ జింజానా స్టేడియంలో శంఖారావం కార్యక్రమానికి అనుమతి లేదని.. ఎవరూ రావొద్దని పోలీసులు అంటున్నారు. విజయవాడ నగరంలో 30, 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. కాదని విజయవాడకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా అగ్రిగోల్డ్ సంస్థ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సంస్థ కస్టమర్స్, ఏజెంట్లు విజయవాడలో శంఖారావ దీక్షకు పిలుపు నిచ్చారు. అగ్రిగోల్డ్ సంస్థ వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసామని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల న్యాయం చేస్తామని చెప్పిన విషయాన్ని బాధితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.