- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..?.. ఇకపై సెల్‌ఫోన్ తీసుకెళ్లవద్దు..!
దిశ, వెబ్ డెస్: బెజవాడ దుర్గమ్మను ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా భక్తులు వచ్చి కనకదర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇటీవల కొందరు భక్తులు ఆలయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సెక్యూరుటీ సిబ్బంది కళ్లు కప్పి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆలయంలో భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి భక్తులు సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించకూడదని సెక్యూరిటీ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. దీంతో సర్వదర్శనం ద్వారా క్యూలైన్‌లోకి వెళ్లకముందే భక్తులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఒక వేళ సెల్ ఫోన్ ఉంటే ముందే తీసుకొని దర్శనానంతరం తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.