- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: కంచుకోటపై టీడీపీ ఫోకస్...పోటీ చేసేది ఎవరో...?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా ఆయన కుటుంబంపైనా అడ్డదిడ్డంగా విరుచుకుపడటంలో ఆ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉంటారు. 2019 ఎన్నికల్లో గెలిచింది తెలుగుదేశం పార్టీ తరఫునే అయినా ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ పంచన చేరిపోయారు. వైసీపీలో అధికారికంగా చేరిపోతే ఎక్కడ బహిష్కరణకు గురవుతుందో అనే భయంతో మద్దతుగా నిలిచారు. వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. అంతేకాదు రాజకీయంగా భిక్ష పెట్టిన టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీని కరుడుగట్టిన వైసీపీ నేత కూడా విమర్శలు చేయని విధంగా ఇంటా బయట తిట్లపురాణం అందుకోవడంలో ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేను ఓడించాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. వల్లభనేని వంశీమోహన్ ఓటమే ధ్యేయంగా దమ్మున్న నాయకుడిని బరిలోకి దించుతామని టీడీపీ ప్రకటిస్తోంది. దీంతో గన్నవరం వేదికగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది.
కంచుకోట నిలబడేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2009 నుంచి ఇప్పటి వరకు వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. 2014,2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ విజయం ఎగురవేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వల్లభనేని వంశీ తన మిత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. ఇక టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా బచ్చుల అర్జునుడును నియమించింది. అయితే అనారోగ్యం కారణాలతో బచ్చుల అర్జునుడు మృతి చెందారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై టీడీపీ అధిష్టానం అన్వేషణ ప్రారంభించింది.
టీడీపీ పరిశీలనలో ఆరుగురు అభ్యర్థులు
వల్లభనేని వంశీ అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. ఆర్థికంగానూ స్థితిమంతుడు. మందిబలం కూడా ఉన్నోడు కావడంతో వైసీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో వంశీని బరిలోకి దించాలని నిర్ణయించింది. వైసీపీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఉన్నారు. దీంతో ఈ నేతలు ఇప్పటికే వంశీకి సహాయనిరాకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ బలహీనతలు, వైసీపీపై ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతోపాటు ఎలాంటి అభ్యర్థిని బరిలోకి దించాలనే దానిపై చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. వంశీకి వైసీపీ నాయకత్వం మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీలో ఏర్పడిన విభేదాలు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్, గద్దే రామ్మోహన్, గద్దే అనురాధ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గన్నవరం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు పేర్లతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో దాసరి బాలవర్థనరావు పార్టీలోకి వస్తే గట్టి పోటీ ఇవ్వడంతోపాటు వైసీపీలోని విభేదాలు పార్టీకి కలిసివస్తాయనే ప్రచారం జరుగుతుంది.
వెళ్లేవారు వెళ్తారు..కొత్తవారొస్తుంటారు:చింతమనేని ప్రభాకర్
ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ అభ్యర్థి క్వాలిఫికేషన్స్‌పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో రూ.150 కోట్లు ఖర్చు పెడతానని ఓ వ్యక్తి తన వద్దకు వచ్చినట్టు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం చింతమనేని ప్రభాకర్ ప్రకటించలేదు. వచ్చేఎన్నికల్లో డబ్బున్నోడిని కాదు , దమ్మునోడిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నవారు వెళ్తారని.. కొత్తవారు వస్తుంటారని.. అయితే మీరు మీసం మేలేసేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. గన్నవరం నియోజకవర్గంపై కన్నేసిన అంతటి బడా నాయకుడు ఎవరా అన్న చర్చ అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ చర్చ జరుగుతుంది.
చంద్రబాబు,లోకేశ్ పోటీచేయాలి : వల్లభనేని వంశీ
టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కౌంటర్ ఇచ్చారు. 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మరో పార్టీలోకి వెళ్లినా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా..? లేక 150 మంది శాసనసభ్యుల బలం వున్న పార్టీ వెంటిలేటర్ పైన ఉందో చింతమనేని ప్రభాకర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబును చూసి ఆ పార్టీ నాయకులంతా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. మంగమ్మ శపథాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గన్నవరంలో చంద్రబాబు, లోకేశ్‌లను పోటీ చేయాల్సిందిగా తాను చాలా సార్లు సవాల్ చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: Breaking: ఉద్రిక్త పరిస్థితుల్లో చంద్రబాబు కీలక ప్రకటన.. దమ్ముంటే గెలవాలని మంత్రికి సవాల్