- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababu Mulakats: రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి జైలులో ములాఖత్‌ల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడు లీగల్ ములాఖత్‌ల సంఖ్యను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఒక్కసారికి కుదించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు లీగల్ ములాఖత్‌లు రోజుకు రెండు ఉండేవని, అయితే జైలు అధికారులు కేవలం ఒక్కసారి మాత్రమే అనుమతి ఇచ్చారని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు లీగల్ ములాఖత్‌లు రెండుకు పెంచాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల విషయంలో జైలు అధికారులకు షాక్ తగిలింది. కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కేసులో చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 42 రోజులుగా ఉన్న విషయం తెలిసిందే.