Gannavaram: వల్లభనేని వంశీకి పోటీగా రంగంలోకి పసుపు దండు

by srinivas |   ( Updated:2023-06-06 10:21:48.0  )
Gannavaram: వల్లభనేని వంశీకి పోటీగా రంగంలోకి పసుపు దండు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రశ్నిస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు ఆస్తులను ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగడాలను ఎండగట్టేందుకు మాజీ ఎంపీ కొణకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో బృందం గన్నవరంలో పర్యటిస్తుందని తెలిపారు.


ఈ బృందంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నియోజకవర్గ టీడీపీ నాయకులు దొంతు చిన్న, చిరుమామిళ్ల సూర్యనారాయణ, దయాల రాజేశ్వరరావు, ఏ.రామకృష్ణారెడ్డి, గూడవల్లి నరసయ్య, గుజ్జర్లపూడి బాబూరావు, కోనేరు నాని, గూడపాటి లక్ష్మీనారాయణ, జూపల్లి సురేశ్‌లు ఉంటారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Advertisement

Next Story