- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada: రెచ్చిపోయిన కుక్కలు.. వెంటపడి మరీ చిన్నారిపై దాడి
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ వన్ టౌన్ వాగు సెంటర్ ప్రాంతంలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. 48వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఇంటి సమీపంలోనే మేఘన (5)చిన్నారిపై మూడు వీధి కుక్కలు మంగళవారం ఉదయం దాడి చేశాయి. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై మూడు వీధి కుక్కలు ఒకేసారి దాడి చేసి గాయపరిచాయి. చిన్నారి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టారు. దీంతో కుక్కదాడిలో గాయపడిన మేఘనను తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కొన్ని నెలలుగా వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న తరుణంలో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంకాకపోవడం వల్లే ఇటువంటి దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను చూసి అయినా అధికారులు స్పందించి వీధికుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.