- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Jagan పాలనపై Renuka Chaudhary సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఏపీలో పాలన చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అరాచకం, రౌడీయిజం విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీ పాలనను ఒక నరకంలా భావిస్తున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? వైసీపీని ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పేలా తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని రేణుకా చౌదరి తెలిపారు. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాలను బట్టి తన నిర్ణయం ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తాను తిరుగుతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మరోవైపు అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమని మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇకపోతే పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని రేణుకా చౌదరి విమర్శించారు.