- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malladi Vishnu: లోకేశ్, బాలకృష్ణ పొలిటికల్ జోకర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాలు బాగోలేక ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేకపోయినా రాజకీయం చేస్తారా అని ఏపీ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుర్రలేని అచ్చెన్న బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘కాలు బాగోలేక సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణానికి వెళ్లలేకపోయారు. మరుసటి రోజు కొంత మెరుగ్గా ఉండటంతో ప్రజల కోసం ఫామిలీ డాక్టర్ కార్యక్రమానికి చిలకలూరిపేట వెళ్తే దాన్ని కూడా టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో అంటుంటే నలుగురు ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం వెళ్లిపోయారన్నారు. ఒక టికెట్ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు వస్తారని అచ్చెన్నాయుడు మాట్లాడటం బుర్రలేనితనమన్నారు. పార్టీ లేదు..బొక్కా లేదని మాట్లాడిన అచ్చెన్నాయుడు.. తమ ఎమ్మెల్యేలు ఆఫర్స్ ఇస్తున్నారని మాట్లాడటం హాస్యాస్పదం, బుద్ధి లేని మాటలు అంటూ కొట్టిపారేశారు. ‘ఎవరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డితిని, నమ్మక ద్రోహం చేసి శానసమండలి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశారని దాన్ని చూపి ఏపీ ప్రజలంతా తమ వైపు ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. అది వాపే అవుతుంది, తప్పితే బలం కానేకాదు. ఎవరో నలుగురు పార్టీకి నమ్మకద్రోహం చేసి మీకు ఓటేస్తే.. వారిని చూసి, ఇక అధికారంలోకి వచ్చేశామని మీరు ఊహల్లో తేలితే.. అది మీ ఖర్మ’. అని మల్లాది విష్ణు మండిపడ్డారు.
బాలకృష్ణ, లోకేశ్‌లు పొలిటికల్ జోకర్లు..
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ఇద్దరూ పొలిటికల్ జోకర్లు అని మల్లాది విష్ణు విమర్శించారు. మామా అల్లుళ్ల మాటలు చూస్తుంటే పొలిటికల్ జోకర్లలా కన్పిస్తున్నారని విమర్శించారు. కనీస జ్ఞానం లేకుండా కేవలం జగన్‌ని విమర్శించడానికే వారి సమయాన్ని వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. ‘మీ బావ చంద్రబాబు- ఓటుకు కోట్లు కేసులో అరెస్టులకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. భయపడిపోయి, ప్రాంతాలు మారేది నువ్వూ, నీ బావ తప్ప వైఎస్ జగన్ కానేకాదు. ఒక నిబద్ధత, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.’ అని మల్లాది విష్ణు కొనియాడారు.
ఇవి కూడా చదవండి: Chandrababu Selfie Challange: చూడు జగన్.. ఇవే మేము కట్టిన ఇళ్లు..!