Kanchikacherla: ఫోన్ పే చేస్తానంటూ రూ.73 వేలు కొట్టేసిన యువకుడు

by srinivas |
Kanchikacherla: ఫోన్ పే చేస్తానంటూ రూ.73 వేలు కొట్టేసిన యువకుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకప్పుడు ఏటీఎం సెంటర్లలో అవగాహన లేనివాళ్లు ఏటీఎం కార్డులను తీసుకెళ్లి మోసపోయిన ఘటనలు అనేకం చూశాం. మోసగాళ్లకు కార్డులు ఇచ్చి అకౌంట్లు ఖాళీ చేయించుకున్న పరిస్థితులు కూడా చూసే ఉంటాం. తాజాగా గూగుల్ పే, పోన్ పే వంటి యాప్‌ల పట్ల అవగాహన లేని వాళ్లు సైతం భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి కృష్ణా జిల్లా కంచికచర్లలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి ఫోన్ పే చేస్తానంటూ రూ.73 వేలు మాయం చేశాడో యువకుడు. కంచికచర్లలో ఓ వ్యక్తి వస్త్ర దుకాణం నడుపుతున్నారు.

అయితే గురువారం ఒక యువకుడు కస్టమర్‌గా వచ్చారు. వస్త్ర దుకాణంలో 15 లుంగీలు, 15 టవల్స్‌ను కోనుగోలు చేశారు. అనంతరం తన మామయ్య ఫోన్ పే చేస్తాడని యజమానికి చెప్పి ముందుగా తన సెల్ నుంచి ఒక రూపాయి పంపించమన్నాడు. ఫోన్ పే పై అవగాహన లేని యజమాని యువకుడికి ఫోన్ ఇచ్చారు. తన ఫోన్‌‌కు రూ.73వేలు పంపించుకుని అక్కడ నుంచి ఆ యువకుడు పరారయ్యారు. దీంతో బాధితుడు కంచికచర్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed