- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: జూ.ఎన్టీఆర్‌ను ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరు?
- ఎన్టీఆర్ పార్టీలోకి జూ.ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తారా?
- చంద్రబాబు,లోకేశ్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలి
- - మాజీమంత్రి కొడాలి నాని
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వస్తానంటే పార్టీ రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంచిందని చెప్పారు. అయితే లోకేశ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేశ్ ఎవడంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడమేంటని నిలదీశారు. టీడీపీ మహానాడు పెట్టి వారసుడి కోసం ఎన్టీఆర్, లోకేశ్‌కు ఓటింగ్ పెట్టాలని సూచించారు. చంద్రబాబు సారథ్యంలో ఎన్నికలకు వెళ్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని.. అదే జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మాజీమంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.
మార్పు రాష్ట్రంలో కాదు...
మార్పు రాష్ట్రంలో కాదు..టీడీపీలో రావాలని ఇదే విషయాన్ని ప్రజలు సైతం కోరుకుంటున్నారని కొడాలి నాని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను చంద్రబాబు హోరంగా అవమానించారని... హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ప్రచారం చేయించాడని చెప్పారు. హరికృష్ణకు పదవులు ఇవ్వకుండా పార్టీకి దూరం చేశారంటూ కొడాలి నాని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారం వరకు వాడుకుని అనంతరం దూరం పెట్టేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ బొమ్మతో ఓటు అడిగే ధైర్యం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను రమ్మంటున్నారని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి : ఒకే ఒక డైలాగ్‌తో ఫుల్‌స్టాప్ .. అదంతా లోకేశ్ వ్యూహమా?