- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక సీటు.. ముగ్గురు పోటీ.. పెనమలూరు టీడీపీలో మూడు ముక్కలాట
దిశ, వెబ్ డెస్క్: పెనమలూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరడంతో ఆ సీటు కోసం ఆశావహులు పెరుగుతున్నారు. పెనమలూరు నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆశిస్తున్నారు. మరోవైపు ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ సైతం ఈసారి ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నారు. అటు విజయవాడ పశ్చిమ నియోజవర్గం నాయకుడు ఎమ్మెస్ బేగ్ కూడా పెనమలూరులో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే వీరిలో ఎవరో ఒకరిని సీటు ఖరారు అవుతోంది. మిగిలిన నేతలు అసంతృప్తులుగా మిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి అనుచరులకు వైసీపీ నేతలు గాలం వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులతో మంత్రి జోగి రమేశ్ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బోడే ప్రసాద్‌కు టికెట్ రాకపోతే తనకు సహకరించాలని రాయబారాలు పంపినట్లు సమాచారం.
అలర్టైన టీడీపీ నేతలు
ఈ పరిణామాలతో పెనమలూరులో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. బల ప్రదర్శనకు దిగిదామని ఇప్పటికే బోడె ప్రసాద్‌పై అనుచరులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తుమ్మల చంద్రశేఖర్ కూడా దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాని ఆయన అనుచరులు అంటున్నారు. అంతేకాదు ఎమ్మల్యే పార్థసారధితో కలిసి చంద్రబాబును కలిసి పనిలో ఉన్నారు. త్వరగా పెనమలూరు సీటుపై క్లారిటీ ఇవ్వాలని టీడీపీ నేత ఎమ్మెస్ బేగ్ డిమాండ్ చేస్తున్నారట. మైలవరం విషయం తేలే వరకూ పెనమలూరుపై స్పందించకూడదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలతో పెనమలూరులో రాజకీయం వేడెక్కింది.
Read More..
సరికొత్త వ్యూహంతో వైకాపా పరిస్థితి అగమ్యగోచరం.. త్వరలోనే పొత్తుల అంశం కొలిక్కి!