Breaking: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం.. విజయవాడ అప్సర థియేటర్ వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-05-20 15:22:52.0  )
Breaking: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం.. విజయవాడ అప్సర థియేటర్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అప్సర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సింహాద్రి సినిమాను రీరిలీజ్ చేశారు. అయితే సినిమాను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. థియేటర్‌లోకి వెళ్లే క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్‌లోని సీట్లకు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను సకాలంలో అదుపు చేశారు. లేదంటే చాలా ప్రమాదంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండేదని థియేటర్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామాపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చూసి వెళ్లిపోవాలి గానీ.. ఇలాంటి ఘటనలకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story