Machilipatnam: జూ.ఎన్టీఆర్ కటౌట్‌కు మేకపోతుల బలి

by srinivas |   ( Updated:2023-05-20 12:12:53.0  )
Machilipatnam: జూ.ఎన్టీఆర్ కటౌట్‌కు మేకపోతుల బలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూ.ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేశారు. తారక్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలోని జీ3 థియేటర్‌లో సింహాద్రి సినిమాని ప్రదర్శించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. జూ.ఎన్టీఆర్ కటౌట్‌కి రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం పేదలకు అన్నదానం నిర్వహించారు. జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్ జెండాలు కట్టుకుని బైక్‌లపై నగర పుర వీధుల్లో చక్కెర్లు కొట్టారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటే తమకు పండుగ అని .. అందుకే మేకపోతులను బలి ఇస్తున్నామని అభిమానులు తెలిపారు. ఎన్టీఆర్ సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకున్నారు.

అయితే మేకపోతులను బలి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం మితిమీరిందని.. హీరో పుట్టిన రోజు అయితే జంతువుల ప్రాణాలు తీయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోపై అభిమానముంటే సినిమాను పది సార్లు చూడాలని.. కాని ఇలాంటి పనులు చేయడమేంటని మండిపడుతున్నారు. ప్రాణం తీసినంత ఈజీగా ప్రాణం పోయగలరా అని ప్రశ్నిస్తున్నారు.

Read More: బాలయ్యతో నేను సాంగ్ చేయడమేంటి?.. ఫైర్ అయిన మిల్కీ బ్యూటీ..

‘సింహాద్రి’ రీరిలీజ్ భారీ నష్టాలను మిగల్చనుందా.?

Advertisement

Next Story