Machilipatnam: జనసేన ఆవిర్భావ సభకు భూమి పూజ

by srinivas |
Machilipatnam: జనసేన ఆవిర్భావ సభకు భూమి పూజ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికకు సంబంధించి ఏర్పాట్లు మెుదలయ్యాయి. మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిలో సుమ కన్వెన్షన్ సెంటర్ పక్కన 34 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాట్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ భూమి పూజ చేసి ప్రారంభించారు. సుమారు 5 నుంచి 15 లక్షల మందితో సభ నిర్వహణకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని బండ్రెడ్డి రామకృష్ణ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ, స్టేట్ స్పోక్స్ పర్సన్ అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story