Gannavaram Incident: సాయికల్యాణికి అండగా టీడీపీ నేతలు

by srinivas |   ( Updated:2023-04-21 10:54:13.0  )
Gannavaram Incident: సాయికల్యాణికి అండగా టీడీపీ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం దాడి ఘటన కేసులో అరెస్టుకు గురై బెయిల్‌పై విడుదలైన తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయికల్యాణి విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం సాయి కల్యాణి, కుటుంబ సభ్యులను కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లోని వారి నివాసంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీపరుచూరి అశోక్ బాబు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇతర నేతలు కలిసి పరామర్శించారు. ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అరెస్టులకు తాను భయపడేది లేదని సాయికల్యాణి నేతలతో అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని మూల్పూరి సాయి కల్యాణి తెలిపారు.

Advertisement

Next Story