Ap News: విజయవాడలో గంజాయి గ్యాంగ్‌ అరెస్ట్

by srinivas |
Ap News: విజయవాడలో గంజాయి గ్యాంగ్‌ అరెస్ట్
X

దిశ ఏపీ బ్యూరో, అమ‌రావ‌తి: గంజాయి సరఫరా చేస్తున్న కీలక వ్యక్తితో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మరో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 90.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు యాంటీనార్కొటిక్ టీం అధికారులు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ హరికృష్ణ ఈ వివరాలను వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒరిస్సా రాష్ట్రం బ‌రంపూర్‌కు చెందిన పింకి రౌత్‌తో పాటు… గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, సుర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణా, మేడ్చల్ జిల్లా, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్, అబ్దుల్ హబీబ్, విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన కొమ్ము రాకేశ్, భవానిపురానికి చెందిన పాలెటి మమత రాజు, విజయవాడ భవానిపురానికి చెందిన మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, షేక్ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్ రెడ్డి, కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కేసులో విజయవాడ కృష్ణ లంకకు చెందిన అడపాల వంశీ, అమన్ సింగ్ మోహన్ ను అరెస్టు చేశామని డీసీపీ హరికృష్ణ తెలిపారు.

సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి విజయవాడలోని పలు ప్రాంతాల్లో యువకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులలో నిందితులైన మరికొందరు పరారిలో ఉన్నారనీ, వీరితోపాటు గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తి అయిన ఒరిస్సాకు చెందిన పింకి రౌత్ తో సంబంధాలు కలిగిన వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం, సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని9121162475 నంబ‌ర్‌కు ఫోన్ ద్వారాగానీ, మెయిల్ ఐడి [email protected] ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ కి సమాచారం తెలపాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డిసిపి హరికృష్ణ హామీ ఇచ్చారు.



Next Story