- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vijayawada: పొంగిన వాగు.. 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పరిసర ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వాగులు, వంకలు(Streams, Bends) పొంగి పొర్లాయి. గంపలగూడెం మండలం వినగడప కట్టెలేరు వాగు(Katteleru Vagu)కు భారీగా వరద నీరు చేరింది. అయితే ఒక్కసారిగా వరద నీరు చేరడంతో వాగు ఉప్పొంగి ఉధృతిగా ప్రవహించింది. దీంతో తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు(Flood water) పోటెత్తింది. ఈ మేరకు సమీప 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనపై నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా తోటమూల నుంచి వినగడప వెళ్లేందుకు సుమారు 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాహనదారులు అంటున్నారు. వంతెన వద్ద పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. వంతెనపై వరద ప్రవాహం తగ్గితే వాహనాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Next Story