ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. అమ్మవారి దర్శనానికి 7 గంటల సమయం

by srinivas |
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. అమ్మవారి దర్శనానికి 7 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైభవంగా దసరా ఉత్సవాలు(Dussehra Celebrations) జరుగుతున్నాయి. దుర్గమ్మ(Durgamma) ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri)కి భక్తులు పోటెత్తారు. ఆలయంపై నుంచి దుర్గా ఘాట్ రోడ్డులోని వినాయక ఆలయం వరకూ భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. వర్షం పడుతున్నా దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి కార్యక్రమం(Purnahuti program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. పుర్ణాహుతి కార్యక్రమంలో ఈవోవైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed