Vijayawada: ఇంద్రకీలాద్రిపై శత చండీసహిత మహారుద్రయాగం

by srinivas |
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శత చండీసహిత మహారుద్రయాగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక కల్యాణార్ధం గురువారం నుంచి ఈ నెల 6 వరకు ఇంద్రకీలాద్రిపై శత చండీ సహిత మహారుద్ర యాగం నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబలు వెల్లడించారు. ఈ యాగంలో 38 మంది రుత్వికలతో కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6న వేద పండితుల ఆశీర్వచనం, పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది అని తెలియజేశారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశానుసారం యాగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు యాగాన్ని ప్రారంభిస్తామని.. యాగాన్ని వీక్షించేందుకు భక్తులకు అనమతిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి నెలలో పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 7న కొండ చుట్టూ గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నామని.. ధర్మ ప్రచార రధం ద్వారా గిరి ప్రదక్షణ ద్వారా భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గిరి ప్రదక్షణ లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబలు కోరారు.

Advertisement

Next Story