- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Cm Chandrababu: అమిత్ షా సార్.. హెల్ప్ చేయండి.. !
దిశ, వెబ్ డెస్క్: బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ విలవిలలాడింది. రెండు రోజులుగా కురిసిన వర్షంతో బుడమేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో వాగు నీరు లోతట్టు ప్రాంతాలకు చేరింది. విజయవాడ సింగ్ నగర్ ఎన్నడూ చూడని విపత్తును చూసింది. నగరంలోని చాలా బస్తీల్లో ఇళ్లు నీటమునిగిపోయాయి. రోడ్లపై 4,5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. వర్షపు నీటితో సింగ్ నగర్, చిట్టీనగర్‌తో పాటు పలు బస్తీలు చిగురుటాకులా వణికిపోయాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ప్రజలు బిల్డింగులపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ పరిస్థితులను చూసిన సీఎం చంద్రబాబు చలించిపోయారు. బోటులో వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. బాధితులకు ట్రాక్టర్లపై పునరావాసాలకు తరలిస్తున్నారు. అయితే సహాయక చర్యలు కొనసాగించేందుకు బోటులు తక్కువగా ఉండటంలో కేంద్రమంత్రి అమిత్ షా సాయం కోరారు. కొద్దిసేపటి క్రితం షాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ పవర్ బోటులను ఏపీకి పంపాలని కోరారు. దీంతో వెంటనే బోటులను పంపుతామని సీఎం చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.