- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: 9 ఏళ్ళుగా ఏపీకి తీరని అన్యాయం..బీజేపీపై జంగా గౌతమ్ ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి 9 ఏళ్ళుగా బీజేపీ తీరని అన్యాయం, ద్రోహం చేసిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెట్ జంగా గౌతమ్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాలు చెప్పడంలో అగ్రస్థానంలో ఉన్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 9 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌కు ఎంత సాయం చేసిందో వివరించి చెప్పేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న శ్రీ కాళహస్తికి, 11న విశాఖకు అమిత్ షా వస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని అమిత్ షా చెప్పాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రో రైలు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం జంగా గౌతమ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపైనా సెటైర్లు వేశారు. బీజేపీతో సీఎం వైఎస్ జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. అందువల్లే ఏపీకి బీజేపీ ఎంతలా ద్రోహం చేస్తున్నా కనీసం మాట్లాడటం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతే గత 4 ఏళ్ళుగా రాష్ట్రానికి బీజేపీ చేసిన సాయంపై, వైసీపీ బీజేపీతో కలిసి ఉమ్మడి శ్వేత పత్రం విడుదలకైనా జగన్ ముందుకు రావాలని కోరారు.
2018లో బీజేపీ ద్రోహంపై ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు ఇటీవల మళ్ళీ అమిత్ షాను కలిసి రహస్య చర్చలు జరిపడం, పొత్తులపై అవగాహన చేస్తున్నట్టు వార్తలు రావడం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ విధానం అనైతిక రాజకీయాలకు పరాకాష్టని, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేయడమేనని జంగా గౌతమ్ తీవ్ర విమర్వలు చేశారు. వైసీపీ 4 ఏళ్ల పాలన సందర్భంగా కేంద్రానికి జగన్ లొంగిపోయారని విమర్శించారు. చంద్రబాబు రెండు రోజులు గడవక ముందే అమిత్ షాను కలవడం పచ్చి రాజకీయ దివాళా కోరుతనమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో బీజేపీతో వైసీపీ, టీడీపీలు పొత్తులకు రహస్య అవగాహనతో వెంపర్లాడుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడగట్టి ప్రజా ప్రత్యామ్నాయాన్ని నిర్మించే కృషి చేస్తుందని జంగా గౌతమ్ వెల్లడించారు. రాష్ట్రంలో వామ పక్షాలు, ప్రత్యేక హోదా అమలు కోసం ఉద్యమిస్తున్న సంఘాలు, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించానికి ముందుకు వచ్చే ప్రజాస్వామిక శక్తులు కలిసి ఐక్య రాజకీయ పోరాటానికి ముందుకు వస్తే ప్రజలకు భరోసా కలుగుతుందని, ఈ కృషిలో కాంగ్రెస్ ముందు ఉంటుందని జంగా గౌతమ్ తెలిపారు.