మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: వైఎస్ జగన్

by srinivas |
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: వైఎస్ జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ మైనార్టీలను గాలికొదిలేసిందని, డిప్యూటీ సీఎం హోదాతో ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. తాము నలుగురు మైనార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని వారికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించామన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం 2019 నుంచి చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేదే తమ బలమన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్ దే కాదని, మనందరిది అని అన్నారు. వివిధ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లకు పైగా నగదు అందజేశామన్నారు. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.23 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మౌజాంలకు గౌరవ వేతనం అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed