విజయవాడలో ఉద్రిక్తత.. వరద పరిహారం కోసం రోడ్డెక్కిన మహిళలు

by srinivas |
విజయవాడలో ఉద్రిక్తత.. వరద పరిహారం కోసం రోడ్డెక్కిన మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో వరద బాధితులు (Flood Victims) రోడ్కెక్కారు. ఇటీవల వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడు పరిహారం కోసం ఆందోళన చెందుతున్నారు. వరదలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే విజయవాడ కమ్మరిపాలెం (Vijayawada Kammaripalem)లో తమకూ పరిహారం ఇవ్వాలని మహిళలు అందోళనకు దిగారు. కమ్మరిపాలెం రోడ్డుపై బైఠాయించారు. వరదలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై దాదాపు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న భవానీపురం పోలీసులు కమ్మరిపాలెం వెళ్లారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టారు. . ఈ క్రమంలో పోలీసులతో మహిళలు ఘర్షణకు దిగారు. అయితే పోలీసుల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన తమకు ఆర్థిక సాయం అందజేయాలని మహిళలు అంటున్నారు. వరదల్లో తమ ఇళ్లలోకి నీళ్లు రాలేదని అధికారులు చెబుతున్నారని, కలెక్టర్ తమ ప్రాంతానికి వచ్చి పరిస్థితి చూపి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed