NBK: సొంతూరులో బాలయ్య సందడి

by srinivas |   ( Updated:2023-03-16 17:25:37.0  )
NBK: సొంతూరులో బాలయ్య సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి చేశారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతుగులుతున్నారంటూ స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బాలయ్య సైతం ఉన్నారు.

దీంతో సభ నుంచి బయటకు వచ్చిన బాలయ్య అక్కడ నుంచి స్వగ్రామం నిమ్మకూరు వెళ్లారు. కారు దిగి బంధువుల ఇంటికి వెళుతున్న బాలయ్యకు సమీపంలోని మహిళా కళాశాల విద్యార్థినిలు స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో బాలయ్య విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం సమీప బంధువుల ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. బాలయ్య రాక గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అక్కడ నుంచి బాలయ్య వెనుదిరిగారు.

Also Read..

‘వినోదయ సిత్తం’సెట్ నుంచి పవన్ ఫొటో లీక్.. అస్సలు నచ్చలేదంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story