కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్... వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే...!

by srinivas |
కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్... వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే...!
X

దిశ, వెబ్ డెస్క్: సాగునీరు కోసం ఎదురు చూస్తున్న కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్ తగిలింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల సాగుకు వచ్చే నెల వరకూ నీరు ఇవ్వలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. మంగళగిరి ఏపీ సచివాలయంలో ఆయన రైతు సమస్యలపై మాట్లాడారు. ఐదేళ్లుగా సీఎం జగన్ కృష్ణా డెల్టాలను పట్టించుకోకపోవడం వల్ల మోటార్లు సరిగా పని చేయడం లేదన్నారు. 2019 టీడీపీ హయాంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుని సాగుకు వాడుకునేవాళ్లమని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.


ప్రస్తుతం అర టీఎంసీ నీరు సైతం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు ఎంతోకొంత తాగు, సానునీరు అందివ్వగలుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జలవనరుల శాఖ కూడా చాలా నష్టపోయిందని మండిపడ్డారు. జగన్ అసమర్థత పాలనతో సాగునీటి ప్రాజెక్టులు ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో చాలా సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో స్పష్టమైన ప్రణాకలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed