- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణుని గెటప్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? 45 ఏళ్లు దాటినా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునే అందం ఈమె సొంతం
దిశ, వెబ్‌డెస్క్: 17 ఏళ్ల వయసులోనే బుల్లితెర నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంజు వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన కో స్టార్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. ఇదే ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఇక ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. పాప పుట్టిన తర్వాత కొంతకాలానికే భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. అలాగే కన్న కూతురు కూడా ఈ భామని విడిచి పెట్టి వెళ్ళిపోయింది. దీంతో మళ్లీ సినిమాలే ఆమెకు జీవిత మయ్యాయి.
ఇక సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు సుమారు 45 ఏళ్లు. అయినా అందం, అభినయం పరంగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. కాగా సూపర్ స్టార్ రజనీ నటిస్తున్న వేట్టైయాన్ మూవీలో 'మనసిలాయో' అంటూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. చాలా మందికి మంజు వారియర్ హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆమె మంచి రచయిత కూడా. ఇక ఆమెకు శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో పలు సందర్భాల్లో నృత్య ప్రదర్శనలతో పాటు.. స్టేజ్ షోలు కూడా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో అందులోదే. ఒక కార్యక్రమంలో భాగంగా కృష్ణుని గెటప్‌లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఈమె మంజు వారియర్ ఆ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(VIDEO LINK CREDITS TO MANJU WARRIER INSTAGRAM ID)