NTR: వరుసగా ఆరు ఫ్లాప్ లు.. గుడ్ బై చెప్పాలనుకున్నాడు.. అన్నకు అండగా నిలిచిన తమ్ముడు ఎన్టీఆర్

by Prasanna |   ( Updated:2024-10-05 09:21:27.0  )
NTR: వరుసగా ఆరు ఫ్లాప్ లు.. గుడ్ బై చెప్పాలనుకున్నాడు.. అన్నకు అండగా నిలిచిన తమ్ముడు ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నిర్మాతగా పెద్ద సాహసాలే చేశాడు. ‘అతనొక్కడే’ మూవీ చేసి అందర్ని షాక్ కు గురి చేశాడు. ఆ మూవీ పెద్ద హిట్ అయి తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. మంచి లాభాలు రావడంతో నిర్మాతగా కూడా నిలబడ్డాడు. కానీ, ఆ తర్వాత అతడికి ఎదురు దెబ్బలు తగలడంతో నిర్మాతగా తప్పుకుందామని అనుకున్నాడు.

హరే రామ్, జయీభవ, కత్తి, ఓం త్రీడీ, ఇజం.. ఇలా సొంత బ్యానర్లో హీరోగా నటించిన కొన్ని సినిమాలు బెడిసి కొట్టాయి. ఆ తర్వాత రవితేజతో చేసిన ‘కిక్-2’ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో తమ్ముడు ఎన్టీఆరే అన్న కళ్యాణ్ రామ్ కు అండగా నిలిచాడు.

నిర్మాతగా కళ్యాణ్ రామ్‌కు అధిక లాభాలు తెచ్చిన సినిమా జై లవకుశ అనే చెప్పుకోవాలి. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. కళ్యాణ్‌ రామ్‌కు అధిక లాభాలు వచ్చాయి. ఆ తర్వాత తానే హీరోగా నటించిన ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం ‘దేవర’తో నిర్మాతగా పెద్ద హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మంచి లాభాలకు సినిమాను అమ్మారు. ఓ వైపు బయ్యర్లు హ్యాపీ. నిర్మాతల్లో ఒకడిగా ఉన్న కళ్యాణ్ రామ్ కూడా ఇంకా హ్యాపీ.

Advertisement

Next Story

Most Viewed